రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

కమర్షియల్ సినిమాల మధ్య రామ్ పోతినేని నటించిన ప్రత్యేకమైన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ప్రశంసలను పొందలేకపోయింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ డిసెంబర్ 25, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రంలో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించగా, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్స్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా, వివేక్ & మెర్విన్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సిద్ధార్థ నుని నిర్వహించగా, నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

తాజా వార్తల