
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ‘అవతార్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా భారతీయ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో తాజాగా ఆసక్తికరంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజమౌళి, మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ పై కామెరూన్ ఆసక్తిగా ప్రశ్నలు అడగడం విశేషంగా మారింది.
జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ, “మీరు ప్రస్తుతం వారణాసి అనే భారీ సినిమా షూట్ చేస్తున్నారని విన్నాను. రాజమౌళి స్పందిస్తూ, “అవును సర్. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం పూర్తయింది. ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలల షూటింగ్ మిగిలి ఉంది అని వివరించారు.
రాజమౌళి సమాధానానికి స్పందించిన కామెరూన్, షూటింగ్ వ్యవధిని విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే సరదాగా స్పందించారు. “ఓహ్… ఇంకా చాలా సమయం ఉందన్నమాట. ఏదైనా ఫన్ సీన్లు, ప్రత్యేకమైన అంశాలు ఉంటే తప్పకుండా నాకు చెప్పండి. ముఖ్యంగా పులులు, సింహాలు లాంటి సీన్లు ఉంటే మాత్రం మర్చిపోకుండా చెప్పాలి” అంటూ నవ్వులు పూయించారు.
కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయాలనీ ఉంది, సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగ వర్క్ చేయాలనీ ఉంది అని కూడా తెలిపారు.
ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు దర్శకులు ఇలా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
మొత్తంగా, ‘అవతార్’ ప్రమోషన్ వేదికగా జరిగిన ఈ జేమ్స్ కామెరూన్ – ఎస్.ఎస్. రాజమౌళి సంభాషణ, భారతీయ సినిమా ప్రభావం ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలోనూ ఎంతగా విస్తరిస్తోందో మరోసారి చాటిచెప్పింది.
