
‘పలాసా 1978’ సినిమాలో గుర్తింపు పొందిన రక్షిత్ అట్లూరి, ‘శశివదనే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. శశివదనే నవంబర్ 28, 2025 నుంచి SunNXT లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ చిత్రంలో రక్షిత్ అట్లూరితో పాటు కోమలీ ప్రసాద్, రంగస్థలం మహేష్, ప్రవీణ్ యండమూరి, శ్రీమన్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించారు.
సాయిమోహన్ ఉబ్బన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అందించారు. సరవణ వాసుదేవన్ సంగీతం అందించగా, అహితేజ బెల్లంకొండ ఏజి ఫిలిం కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
