
రష్మిక మందన్న నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రం డిసెంబర్ 5, 2025 నుంచి నెట్ఫ్లిక్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమ్ కానుంది. రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమాకి దర్శకత్వం రాహుల్ రవీంద్రన్ వహించారు. సంగీతాన్ని హేషం అబ్దుల్ వాహబ్ సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్రశాంత్ ఆర్ విహారి అందించారు. చిత్రానికి సినిమాటోగ్రఫీని కృష్ణన్ వసంత్ నిర్వహించగా, విద్య కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
