
పరిమిత బడ్జెట్‌తో రూపొందినప్పటికీ థియేటర్లలో విడుదలకు ముందే మంచి బజ్ సృష్టించిన చిత్రం శ్రీ చిదంబరం గారు. టాలీవుడ్‌కు చెందిన కొంతమంది ప్రముఖ నిర్మాతలు, నటులు ఈ చిత్రానికి మద్దతుగా నిలవడం వల్ల సినిమా పై ఆసక్తి పెరిగింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఓటీటీ హక్కులను ETV Win సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 19, 2026 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకుల నుండి కొంతవరకు మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. గ్రామీణ భావోద్వేగాలు, సహజమైన పాత్రలు కథకు బలం చేకూర్చాయి. పెద్ద చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, కథనం వల్ల ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపినాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మొరం, శంకర్ రావు నటించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నటీనటుల నటన ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వినయ్ రత్నం వహించారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింత వినీషా రెడ్డి, చింత గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. చందు రవి సంగీతం సమకూర్చారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ, అన్వార్ అలీ ఎడిటింగ్.
గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించిన సినిమాటోగ్రఫీ, భావోద్వేగాలను హైలైట్ చేసిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
థియేటర్లలో మిస్సైన వారు ఇప్పుడు ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రాన్ని ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 19 నుంచి వీక్షించవచ్చు. గ్రామీణ ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ఎంపికగా నిలుస్తుంది.
