
సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావడం అభిమానులకు చిన్న షాక్‌గా మారింది.
విడుదల సమయంలోనే ‘జటాధర’ ప్రేక్షకులని మెప్పించలేకపోయింది, దీంతో అనుకున్న దానికంటే ముందే OTT లోకి ఒచ్చింది.
ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఏ పోస్టర్, టీజర్, ప్రమోషనల్ మెటీరియల్ కూడా రాకపోవడంతో, ప్రైమ్లో వీడియో సినిమా అందుబాటులోకి రావడం ఒక సర్ప్రైజ్‌లా మారింది.
సినిమా ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ, సుదీర్ బాబు నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాతో హిందీ నటి సోనాక్షి సిన్హా తెలుగు డెబ్యూ చేసింది, సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చాల నమ్మకం పెట్టుకుంది, కానీ గోరా పరాజయం అవడంతో, సోనాక్షి కూడా కొంత నిరాశ చెందింది.
