
‘గుర్రం పాపి రెడ్డి’ చిత్రం 2025 డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు రెండు వారాల్లోనే ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. ‘గుర్రం పాపి రెడ్డి’ జనవరి 16, 2025 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫారియా అబ్దుల్లా, యోగి బాబు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు, రాజ్‌కుమార్ కాశిరెడ్డి, వంశీధర్ కోస్గి, జీవన్ కుమార్, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ ప్రాజెక్ట్‌కు మురళి మనోహర్ దర్శకత్వం వహించగా, కృష్ణ సౌరభ్ సురంపల్లి సంగీతాన్ని అందించారు. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ నిర్వహించగా, వేణు సద్ది, అమర్ బూరా, జయకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
