
అయలాన్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే చాలా కాలం క్రితమే సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఆడియో స్ట్రీమింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే ఆహా వీడియో ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, చిత్తా సిద్ధార్థ్, శరద్ కేల్కర్, ఈషా కొప్పికర్, కరుణాకరన్, యోగి బాబు, కోతండం, బాలా, శరవణన్, బానుప్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రవికుమార్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కేజేఆర్ నిర్మించింది. సంగీతాన్ని ఏ.ఆర్.రహమాన్ అందించగా, సినిమాటోగ్రఫీని నిరవ్ షా నిర్వహించారు.
