Illegal Relationship: కొన్నిసార్లు అక్రమ సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. వీటి కారణంగా కాపురాలు కూలిపోతాయి. చిన్నారులు అనాథలుగా మారిపోతారు. కొన్ని క్షణాల తియ్యటి అనుభూతి కోసం కొందరు వ్యక్తులు మొత్తం జీవితాన్నే తాకట్టు పెడుతుంటారు. అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోనూ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా చోళవరం గ్రామానికి చెందిన బాబు, ఆముద భార్యాభర్తలు. కొన్నాళ్ల క్రితం వీళ్లకు వివాహం కాగా ఆనందంగా గడుపుతున్నారు. వీళ్ల అనుబంధానికి గుర్తుగా ఓ బాబు కూడా జన్మించాడు. దీంతో దంపతుల కాపురం సాఫీగా సాగుతోంది. అయితే వీళ్ల ఫ్యామిలీలోకి ఓ వ్యక్తి ప్రవేశించడంతో కాపురం కూలిపోయింది. చోళవరం గ్రామానికే చెందిన జగదీష్ అనే వ్యక్తితో ఆముద పరిచయం పెంచుకుంది.
కొంతకాలం గడిచిన తర్వాత ఆముద, జగదీష్ మధ్య పరిచయం అక్రమ సంబంధంగా మారింది. అయితే ఈ విషయం ఆముద కుమారుడికి తెలియడంతో అతడు తండ్రికి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ బాబు, ఆముద ఘర్షణకు దిగేవారు. ఇదంతా తట్టుకోలేక ఆముద ప్రియుడి మోజులో భర్త, కుమారుడిని విడిచిపెట్టి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని జల్లెడ పట్టి వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చి బుద్ధిగా ఉండాలని హితవు పలికారు.
మారని ఆముద.. మరోసారి పరారీ
అయితే అక్రమ సంబంధంపై ఎవరికీ అంత త్వరగా మోజు పోదు. ఆముద విషయంలోనూ ఇదే జరిగింది. ఎంత జరిగినా ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. మరోసారి ప్రియుడు జగదీష్‌తో కలిసి కట్టుకున్నవాడిని, కన్నబిడ్డలను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోయింది. ఈసారి ఆమె ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇంటి నుంచి పారిపోయిన 20 రోజులకు తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఆమె శవమై కనిపించింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రియుడు జగదీష్ హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.