
బిగ్ బాస్ 9 తెలుగులో నామినేషన్ ప్రాసెస్ మాంచి రసవత్తరంగా మొదలైంది. ఈ ప్రాసెస్ రెండు ప్రక్రియల్లో జరిపారు. మొదటిది సీక్రెట్ నామినేషన్, ఇక రెండోది ,ఫోటో తీస్కొని తగిన కారణాలు చెప్పి, వారి ఫోటో మంటల్లో వేయాలి.
ఇక ఈ ప్రాసెస్లో భరణి–దివ్య మధ్య వచ్చిన ఈ వాగ్వాదంతో హౌస్‌లో టెన్షన్ మూడ్ ఏర్పడగా, తర్వాత కళ్యాణ్ పడాల, డీమన్ పవన్ల నామినేషన్ భాగంగా ఇద్దరి మధ్య మాటలు మరింతగా భగ్గుమన్నాయి.
కళ్యాణ్, పవన్‌ను నామినేట్ చేస్తూ “డీమన్ అనిపించుకోవడం ఒక్కటే కాదు… ఆగ్రహం కూడా కంట్రోల్‌లో పెట్టాలి” అని చెప్పడంతో పవన్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనితో హౌస్ వాతావరణం ఒక్కసారిగా హీట్ అయ్యింది.
ఇక డెమోన్, ఇమ్మానుయేల్ ని నామినెటే చేసే ప్రాసెస్లో, కళ్యాణ్ మధ్యలో రావడం, ఇటు రి తు రావడంతో, చాల పెద్ద గొడవే అయింది. ఇక ఈ వ్యవహారంలో డెమోన్ “కళ్యాణ్ పికా పట్టుకున్నాడు, దీంతో ఒక్కసారిగా ఇమ్మానుయేల్ అలా చేయొద్దు అని అందడంతో డెమోన్ కూల్ అయ్యాడు.
అయితే ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీని గురించి వీకెండ్లో నాగార్జున గారు ఎలా స్పందిస్తారో చూడాలి.
