
రాయపూర్‌లో నిర్వహించిన రెండో వన్డేలో భారత్ ముందు బ్యాటింగ్ చేసి 358/5 రన్స్ సాధించింది. విరాట్ కోహ్లీ 102 పరుగుల సెంచరీ చేసి, రుతురాజ్ గైక్వాడ్ 105 పరుగుల చేసినప్పటికీ, భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది.
దక్షిణాఫ్రికా ఈ భారీ లక్ష్యాన్ని సాదించడంలో సరికొత్త రికార్డు స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇడెన్ మార్కరం 110 చేసి ఇండియాకు ఎదురుగా నిలిచాడు. అతని ఆటకి తోడు, సహ బాటర్‌లు మద్దతుగా నిలిచారు. ఫైనల్ ఓవర్‌లలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
తొలి వన్డేలో భారత్ గెలిచినప్పటికీ, సిరీస్ ఇప్పుడు 1–1 సమంగా పూర్తయింది. మూడో వన్డేలో భారత జట్టు ఎలాంటి ప్రణాళికతో వస్తారు వేచి చూడాలి.
