ICC నెట్‌ఫ్లిక్స్‌ను ఆహ్వానించింది: 2026 T20 వరల్డ్‌కప్ నుంచి క్రికెట్ ప్రసార హక్కులు OTTకి?

ICC నెట్‌ఫ్లిక్స్‌ను ఆహ్వానించింది 2026 T20 వరల్డ్‌కప్ నుంచి క్రికెట్ ప్రసార హక్కులు OTTకి?

ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ICC) నుండి క్రికెట్ ప్రసార హక్కుల విషయంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న T20 వరల్డ్‌కప్‌ నుంచి ప్రసార హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌కు అధికారిక ఆహ్వానం పంపినట్లు ICC వర్గాలు తెలిపినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా OTT రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ను డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా మరింత పెద్దస్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు వంటి విభిన్న కంటెంట్‌తో బలమైన స్థానం సంపాదించిన నెట్‌ఫ్లిక్స్‌ క్రికెట్‌ వంటి భారీ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ప్రసారంలోకి ప్రవేశిస్తుందా అనే ఆసక్తి పెరిగింది.

క్రికెట్‌ ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉండటం, ఆసియా మార్కెట్‌లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ICC కొత్త భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఈ ఒప్పందం జరిగితే, T20 వరల్డ్‌కప్‌ సహా ICC ప్రధాన టోర్నీలు OTTలో నేరుగా ప్రసారం కావడం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో క్రికెట్‌ డిజిటల్‌ ప్రసార రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Similar Articles

Comments

తాజా వార్తల