Fat Burning Tips : ఈరోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. ఆధునిక జీవనవిధానం సరైన ఆహారం, నిద్ర లేకపోవడం, విపరీతమైన ఒత్తిడి కారణంగా యుక్తవయస్సులోనే గుండె జబ్బులతో చాలామంది సతమతమవుతున్నారు. అలాగే శరీర బరువుపై నియంత్రణ లేకపోవడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటివి కూడా గుండెజబ్బులకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో తెలుసుకుందాం.
రక్తనాళాలు రక్తాన్ని గుండెకు సరఫారా చేస్తాయి. గుండె ఈ రక్తం మొత్తం శరీర భాగాలకు సరఫరా అవుతుంది. అందుకే నాళాలు కొవ్వు పేరుకుపోయి మూసుకుపోవడం వలన హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. రక్తనాళాలలో మలినాలు పేరుకుపోవడం వనల 100 రకాల గుండె జబ్బులు ఏర్పడతాయి. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. దీనివలన ఒత్తిడి ఎక్కువై కంటిచూపు కూడా మందగిస్తుంది.
రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వలన బద్దకం పెరిగి ఏ పని చెయ్యడానికి మనసు రాదు. దీని వలన మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. మతిమరపు కూడా వస్తుంది. అందుకే రక్తనాళాలు శుభ్రంగా ఉండాలి. ఎటువంటి మలినాలు అడ్డుపడకుండా రక్తప్రసరణ జరిగితే ఆరోగ్యం బాగుంటుంది.
రక్తనాళాలను శుభ్రపరచుకునేందుకు చిట్కా:
రక్తనాళాలను రెండురోజుల్లోనే శుభ్రపరచుకునే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఆయుర్వేద మూలా కలిగినది కావడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని కోసం సొరకాయ, కొత్తమీర, పుదీనా, తులసి ఆకులు తీసుకోండి. ముందుగా సొరకాయను మిక్సీలో వేసి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోండి. తరువాత 19 కొత్తిమీర రెమ్మలు, పది పుదీనా రెమ్మలు, పది తులసి ఆకులు తీసుకొని వీటన్నింటినీ మిక్సీవేసి పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సొరకాయ జ్యూస్‌లో కలిపి రోజూ తాగడం వలన మీ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.