Coriander Water Benefits: మనలో చాలా మంది ఉదయం లేవగానే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగుతుంటాం. మరికొందరు వేడి నీళ్లు తాగుతుంటారు. ఇంకొందరు వేడినీళ్లలో నిమ్మకాయ పిండి, తేనె కలిపి తీసుకుంటూ ఉంటారు. కాఫీ, టీల కంటే వేడి నీళ్లు మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో ఉదయాన్నే కొన్ని పనులు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైనవి దనియాలు.
కూరలు రుచిగా రావాలన్నా, మసాలా దట్టించి వేయాలన్నా ధనియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ ధనియాలది కీలక పాత్ర. ధనియాల్లో కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది. జుట్టు సమస్యలకూ ధనియాలతో చెక్ పెట్టవచ్చు. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, అలసట లాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు ధనియాలను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధనియాల నీటిని ఇలా తీసుకోవాలి..
ధనియాలు, కొత్తమీర చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్, శ్వాస సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నా తీరిపోతుంది. శరీరంలో వేడి సమస్య ఉన్న వారు రోజూ ధనియాల నీరు తీసుకోవాలి. దీని వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి ఉన్న వారు నిద్ర పట్టక, ఒంట్లో నలతగా ఉండటం లాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి వారు ధనియాల నీరు తీసుకోవాలి.
ముందుగా ధనియాలు నీటిలో వేసి మరిగించాలి. రెండు గ్లాసుల నీరు తీసుకొని ఒకే గ్లాసుకు రాగానే వాటిని చల్లార్చి తాగాలి. ఇలా రోజూ ఖాళీ కడుపుతో ఓ గ్లాసు ధనియాల నీళ్లు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ధనియాలను నూనెతో కలిపి తీసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయట పడొచ్చని చెబుతున్నారు. ధనియాలతో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రోజూ మన ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.